కూట సాహిత్యం

వికీపీడియా నుండి
09:12, 23 మార్చి 2023 నాటి కూర్పు. రచయిత: Inquisitive creature (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

కూట సాహిత్యం అంటే పాఠకులను మోసగించేందుకు గానూ తప్పుడు మౌలిక వివరాలు ఇవ్వబడ్డ రచనలు. ఇవి ముఖ్యంగా రెండు రకాలు. మొదటి రకంలో ఒక రచనను ఎవరైనా ఒక పెద్ద రచయిత వ్రాసినట్లుగానో, లేక ఒక కల్పిత వ్యక్తిని దాని రచయితగానో చెప్పగా, రెండో రకంలో కొన్ని కల్పిత కథలను రచయిత తన సొంత అనుభవాలుగా సమాజాన్ని నమ్మింపజూడటం జరుగుతుంటుంది.

ద సొంగ్స్ ఒఫ్ బిలీటిస్ (1894) శిర్షిక. ఇది పురాతన గ్రీకు శృంగార కావ్యానికి తాను చేసిన ఫ్రెన్చ్ అనువాదమని అబద్దమాడుచూ ప్యెర్ లుయిస్ అనే రచయిత వ్రాసిన కావ్యం

వివిధ ఉదాహరణలు

కూట సాహిత్యంలో ఒక రచనకు కర్తగా, అసలు రచయిత పేరు బదులు, తమ పేరిట ఉన్న రచనలకు అప్పటికే ఒక విలువా, ప్రత్యేక పాఠక బృందాలను సంపాదించుకున్న పేరొందిన రచయితల పేరు వాడుకోవడం జరుగుతుంటుంది. ఇందుకుగానూ ఆ కూట సృష్టికర్త తన రచననూ ఆ పెద్ద రచయిత శైలిలో వ్రాయడమో, లేదా పెద్ద రచయిత ఎక్కువగా వాడే కాగితం, సిరాలతో, ఆ రచయిత చేతివ్రాతను తలపించేలా చేవ్రాలు వ్రాయడమో చేస్తుంటాడు. చేతిరచనల్లో వాడే కాగితం, సిరాల దగ్గరి నుండి, దస్తూరి వరకూ అన్నీ సరిపోలేలా చేయడం కష్టం కనుక ఈ దారిని ఎక్కువ మంది ఎంచుకోరు.